JagadishReddy: ఆ విషయాల్లో కేసీఆర్ రాజీపడరు
ABN , First Publish Date - 2023-02-03T12:36:50+05:30 IST
బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్‌కు ఇచ్చే ప్రోటోకాల్ కచ్చితంగా ఇస్తామని, అటువంటి విషయాల్లో సీఎం కేసీఆర్ రాజీపడరని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ (Telangana Governor)కు ఇచ్చే ప్రోటోకాల్ కచ్చితంగా ఇస్తామని, అటువంటి విషయాల్లో సీఎం కేసీఆర్ (CM KCR) రాజీపడరని మంత్రి జగదీష్ రెడ్డి (Minister JagadishReddy) అన్నారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడుతూ.. మొన్నటి వరకు వేరు...ఇప్పటి వరకు వేరన్నారు. గవర్నర్ రాజకీయాలు చేశారు కాబట్టే తాము కూడా రాజకీయాలు చేశామని తెలిపారు. ఇవాళ గవర్నర్ యాదాద్రీ టూర్ విషయంలో ఆలయ అధికారులు తగిన ప్రోటోకాల్ (protocol) ఇచ్చారని అన్నారు. పెండింగ్ బిల్లుల అంశం గవర్నర్‌కే తెలియాలని చెప్పుకొచ్చారు. రాజకీయమే ప్రోటోకాల్ ....ప్రోటోకాల్ యే రాజకీయమని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.