KTR: మోదీజీ.. అమిత్‌షా జీ ఎక్కడున్నారు?.. మణిపూర్‌ ఘటనపై కేటీఆర్ రియాక్షన్

ABN , First Publish Date - 2023-07-20T09:52:01+05:30 IST

మణిపూర్‌లో కుకీ స్త్రీలను నగ్నంగా ఊరిగించి అత్యాచారం, హత్యపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

KTR: మోదీజీ.. అమిత్‌షా జీ ఎక్కడున్నారు?.. మణిపూర్‌ ఘటనపై కేటీఆర్ రియాక్షన్

హైదరాబాద్: మణిపూర్‌లో కుకీ స్త్రీలను నగ్నంగా ఊరిగించి అత్యాచారం, హత్యపై మంత్రి కేటీఆర్‌ (Minister KTR) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘తాలిబాన్‌లు పిల్లలను, మహిళలను అవమానిస్తే భారతీయులుగా మనం వారిపై విరుచుకుపడుతున్నాము. ఇప్పుడు మన దేశంలోనే మణిపూర్‌లో మెయిటీ గుంపు కుకీ స్త్రీలను నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురిచేయడం బాధాకరం. కొత్త భారతదేశంలో అనాగరిక చర్యలు విచారకరం. భయానక హింసాకాండను, శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్న కేంద్ర ప్రభుత్వం మౌనంగా చూస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ... అమిత్‌షా జీ ఎక్కడ ఉన్నారు?.. దయచేసి అన్నింటినీ పక్కన పెట్టండి. మీ సమయాన్ని శక్తిని మణిపూర్‌ను రక్షించడం కోసం వినియోగించండి’’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

కాగా... మణిపూర్‌లోని నాంగ్‌పోక్‌ సెక్మాయ్‌‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మే 4న పట్టపగలు కుకీ తెగకు చెందిన ముగ్గురు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడి, వారిలో ఇద్దరిని హతమార్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ‘‘మే 4న మైతేయిలు అత్యంత పాశవికంగా కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించారు. సాయుధులైన యువకులు దారిపొడవునా వారి మర్మావయవాలను తడుముతూ పైశాచికానందం పొందారు. ఆ తర్వాత వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల గుర్తింపు (ఐడెంటిటీ) తెలిసేలా.. ఉద్దేశపూర్వకంగా వీడియోను విడుదల చేశారు’’ అని ఆ ఫోరం నేతలు వివరించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళలపై ఇంత పైశాచికంగా ప్రవర్తించడం పట్ల రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2023-07-20T09:52:01+05:30 IST