Minister Srinivas Goud: ఏ ఆధారాలతో కిషన్ రెడ్డి కవితపై ఆరోపణలు చేశారు?...

ABN , First Publish Date - 2023-03-21T13:52:23+05:30 IST

ఏ ఆధారాలు లేకుండా ముందుగానే ఊహించుకుని కవితపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శలు చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.

Minister Srinivas Goud: ఏ ఆధారాలతో కిషన్ రెడ్డి కవితపై ఆరోపణలు చేశారు?...

ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మూడోసారి మంగళవారం ఈడీ (ED) విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఢిల్లీలో మీడియా సమావేశం (Press Meet)లో మాట్లాడుతూ.. ఏ ఆధారాలు లేకుండా ముందుగానే ఊహించుకుని కవితపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శలు చేశారని మండిపడ్డారు. అసలు సెల్ ఫోన్లు ఉన్నాయా? లేదా? నోటీసులు ఇవ్వకుండా కవితపై ఎలా నిందలు వేస్తారని ఆయన ప్రశ్నించారు. నిన్న ఈడీ అధికారులు సెల్ ఫోన్లపై అడిగిన ప్రశ్నకు మంగళవారం తీసుకువస్తానని చెప్పి, ఓ లేఖ ఈడీ అధికారికి కవిత సమర్పించారన్నారు. దీనికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఒకరిపై విమర్శలు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలన్నారు.

సీఎం కేసీఆర్‌ (CM KCR)ను ఎదుర్కోలేక ఆయన కుమార్తె కవితపై కక్ష సాధిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఆడ బిడ్డపై ప్రతాపం చూపిస్తున్నారని, రూ. వంద కోట్ల స్కామ్ అంటున్నారు.. మరి విజయ్ మాల్య (Vijay Mallya), నీరవ్ మోడీ (Nirav Modi), లలిత్ మోడీ (Lalit Mod) ఎన్ని కోట్లు స్కామ్ చేశారని మంత్రి ప్రశ్నించారు. అదానీ (Adani)కి చెందిన ఎన్ని లక్షల కోట్లు ఆవిరి అయిపోయాయన్నారు. లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వారిని విదేశాలకు పంపించారని, వారిని పట్టుకునే ప్రయత్నం చేయలేని విమర్శించారు. వారిపై ఉన్న రెడ్ కార్నర్ నోటీసులు (Red Corner Notice) కూడా విత్ డ్రా చేశారని దుయ్యబట్టారు. వాళ్లను వదిలిపెట్టి వంద కోట్ల స్కామ్ అని చెప్పి తెలంగాణ ఆడబిడ్డను 10 రోజులుగా వేధిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు సృష్టించి అప్రదిష్టపాలుచేస్తున్నారన్నారు. ఈరోజు కవిత ఫోన్లు ఈడీ అధికారులకు సమర్పించారని... ఈ ఫోన్లు ధ్వంసమయ్యాయంటూ ఏ ఆధారాలు లేకుండా విమర్శలు చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కవితకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

కాగా రెండు గంటలుగా కవిత ఈడి విచారణ కొనసాగుతోంది. తన మొబైల్ ఫోన్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అధికారులకు ఇచ్చారు. లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా తాను ఎక్కడ తప్పు చేయలేదని.. నిర్దోషిగానే ఉన్నానని.. ఈ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఇప్పటికే కవిత ప్రకటించారు.

Updated Date - 2023-03-21T13:52:23+05:30 IST