Talasani Srinivas: 16న పాతబస్తీ బోనాలకు ఏర్పాట్లు పూర్తి
ABN , First Publish Date - 2023-07-11T12:40:49+05:30 IST
సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్: సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. మంగళవారం గోషామహల్, మలక్‌పేట, కంటోన్మెంట్ నియోజకవర్గాల పరిధిలోని దేవాలయాలకు బోనాల ఉత్సవాల ఆర్థిక సహాయం చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రకటించారన్నారు. ఎంతో విశిష్టత కలిగిన బోనాల ఉత్సవాలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని తెలిపారు. ప్రైవేటు దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఈనెల 16 న జరిగే పాతబస్తీ బోనాలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతుందన్నారు. బోనాల సందర్భంగా వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.