Share News

Medigadda Dam: మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు మంత్రుల బృందం

ABN , Publish Date - Dec 29 , 2023 | 07:28 AM

జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు మంత్రుల బృందం శుక్రవారం రానుంది. ఇక్కడే బ్యారేజీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు.

Medigadda Dam: మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు మంత్రుల బృందం

జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు మంత్రుల బృందం శుక్రవారం రానుంది. ఇక్కడే బ్యారేజీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ బృందంతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మేడిగడ్డకు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకోగానే ఈఎన్‌సీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజీ ఫౌండేషన్‌ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై సమీక్ష నిర్వహిస్తారు. నీటిపారుదల శాఖ అధికారులతో పాటు కాళేశ్వరం ఇంజనీర్లు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ సంస్థల ఇంజనీర్లు, ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1గంట నుంచి 2గంటల వరకు మంత్రుల బృందం బ్యారేజీని సందర్శించనుంది. మధ్యాహ్నం 2 నుంచి 3గంటల వరకు మీడియా ప్రతినిధులతో లంచ్‌ అనంతరం, 3గంటల నుంచి సాయంత్రం 4.20 గంటల వరకు మేడిగడ్డ నుంచి అన్నారం చేరుకుని బ్యారేజీని పరిశీలిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు అన్నారం నుంచి తిరిగి హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

Updated Date - Dec 29 , 2023 | 07:28 AM