BJP MLA: స్మితా సబర్వాల్‌పై ఎమ్మెల్యే రఘునందన్‌రావు పరోక్ష విమర్శలు
ABN , First Publish Date - 2023-08-19T15:22:20+05:30 IST
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు పరోక్షంగా విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... గిరిజన మహిళను పోలీసులు కొడితే.. సీఎంవోలో ఐఏఎస్ అధికారిణి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో ఘటనలపై స్పందించే ట్విట్టర్ పిట్ట స్పందించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌పై (IAS Officer Smita Sabharwal) బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు (BJP MLA Raghunandan rao) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... గిరిజన మహిళను పోలీసులు కొడితే.. సీఎంవోలో ఐఏఎస్ అధికారిణి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో ఘటనలపై స్పందించే ట్విట్టర్ పిట్ట స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు ట్విట్టర్ పిట్టకు కన్పించటం లేదా అని నిలదీశారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ (Minister KTR), కవిత (MLC Kavitha) ఎందుకు స్పందించటం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సొంత నియోజకవర్గంలో మహిళకు జరిగిన అన్యాయం కంటే.. ఎమ్మెల్యే సీటే సబితా ఇంద్రారెడ్డికి (Minister Sabita Indrareddy) ముఖ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే మహిళపై దాడి చేయటం బాధాకరమన్నారు. ఘటనకు బాధ్యులైన ఎస్‌హెచ్‌ఓ, పోలీసు ఉన్నతాధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సీసీ టీవీలు లేనప్పుడు.. రూ.1200 కోట్లతో కట్టిన కమాండ్ కంట్రోలు ఎందుకు అంటూ రఘునందన్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాగా.. పోలీసుల చేతిలో తీవ్రంగా గాయపడి కర్మాన్‌ఘాట్‌లోని జీవన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు వరలక్ష్మిని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శనివారం పరామర్శించారు. ఆమెను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు వరలక్ష్మి పట్ల మానుషంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబానికి అండగా ఉంటామని చెబుతూ.. బాధితురాలి కుటుంబానికి తమ వంతు సాయంగా కొంత నగదును అందజేశారు. అలాగే పలువురు నేతలు కూడా రఘునందన్ రావుతో కలిసి బాధిత మహిళ వరలక్ష్మిని పరామర్శించారు.