ORR: ఔటర్‌పై కొత్త స్పీడ్ లిమిట్స్.. రూల్స్ మారాయ్.. వాహనదారులూ ఓ లుక్కేయండి..

ABN , First Publish Date - 2023-07-31T15:27:06+05:30 IST

ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఔటర్‌పై కొత్త స్పీడ్ లిమిట్స్ సంబంధించి సైబరాబాద్ పోలీసులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈరోజు అనగా సోమవారం నుంచే కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి.

ORR: ఔటర్‌పై కొత్త స్పీడ్ లిమిట్స్.. రూల్స్ మారాయ్.. వాహనదారులూ ఓ లుక్కేయండి..

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఔటర్‌పై కొత్త స్పీడ్ లిమిట్స్ సంబంధించి సైబరాబాద్ పోలీసులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈరోజు అనగా సోమవారం నుంచే కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. లైన్-1, 2లో.. 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్‌ను పోలీసులు అనుమతించారు. అలాగే లైన్- 3, 4 లో 80 నుంచి 100 కిలోమీటర్ల స్పీడు లిమిట్‌‌కు మాత్రమే అనుమతి ఉండనుంది. ఐదవ లైన్‌లో 40 కిలోమీటర్ల స్పీడ్‌కు అనుమతి ఇచ్చారు పోలీసులు. 40 కిలోమీటర్ల స్పీడ్‌కు తక్కువ వెళ్లే వాహనాలకు అనుమతి లేదని.. అలాగే టూ వీలర్స్‌కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పాదచారులకు కూడా అనుమతి లేదని సైబరాబాద్‌ పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2023-07-31T15:35:09+05:30 IST