Excel Group ఆఫ్ కంపెనీస్‌లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
ABN , First Publish Date - 2023-01-04T14:26:06+05:30 IST
హైదరాబాద్ నగరంలో ఐటీ దాడులు(IT attacks) కొనసాగుతున్నాయి. 7 గంటలుగా ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (Excel Group of Companies)లో ఏకకాలంలో 40 చోట్ల ఐటీ
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఐటీ దాడులు(IT attacks) కొనసాగుతున్నాయి. 7 గంటలుగా ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (Excel Group of Companies)లో ఏకకాలంలో 40 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆరుగురు డైరెక్టర్ల ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎక్సెల్ గ్రూప్‌కి అనుబంధంగా ఉన్న మరో 3 కంపెనీలు స్పిన్ మ్యాక్స్, విలాస్ పాలిమర్, ACE కంపెనీల్లో కూడా సోదాలు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని కార్పొరేట్ ఆఫీస్‌తో పాటు మాదాపూర్, బాచుపల్లిలోని కార్యాలయాల్లోనూ దాడులు జరుగుతున్నాయి. రబ్బర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్‌లో భారీగా తేడాలతో పాటు ట్యాక్స్ చెల్లింపులో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. ఈ కంపెనీల డైరెక్టర్లుగా శిరీష గంగారం, వాసుదేవ రెడ్డి గంగారం, మంజూష గంగారం, రఘునాథ రెడ్డి గంగారం, షాబద్దీన్ హాబీబ్ సయ్యద్ (బడేమియా పెట్రోల్ బంక్ ఓనర్), మాధవరెడ్డి బడ్డేవోలు ఉన్నారు.
మంజూష.. అనిరుద్ రెడ్డి భార్య. అనిరుద్ రెడ్డి కోమటిరెడ్డి మేనల్లుడు. జనంపల్లి అనిరుద్ రెడ్డి టీపీసీసీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. యూడబ్ల్యూఈ గ్రానైట్ సంస్థకు డైరెక్టర్లుగా మంజూష గంగారం, అనిరుద్ రెడ్డి ఉన్నారు. యూడబ్ల్యూఈ గ్రానైట్ సంస్థ ప్రస్తుతం స్ట్రైక్ ఆఫ్‌లో ఉంది.
సంగారెడ్డి జిల్లాలో 5 చోట్ల ఐటీ దాడులు
సంగారెడ్డి జిల్లాలో 5 చోట్ల ఐటీ దాడులు జరుగుతున్నాయి. కంది మండలం చేర్యాల, జుల్కల్‌లోని రెండు ఎక్సెల్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్, అనుబంధ సంస్థ ACE టైర్ల పరిశ్రమలో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మైలారంలోని ఎక్సెల్ దాని అనుబంధ పరిశ్రమలు విలాస్ పొలిమేరాస్ రెండు కంపెనీల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. బొల్లారంలోని పరిశ్రమలోనూ కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.