Hyderabad: పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు....
ABN , First Publish Date - 2023-03-24T15:09:10+05:30 IST
హైదరాబాద్: పటోళ్ల గోవర్ధన్ రెడ్డి (Patolla Govardhan Reddy) హత్య కేసు (Murder Case)లో శుక్రవారం నాంపల్లి కోర్టు (Nampalli Court) తీర్పు ఇచ్చింది.
హైదరాబాద్: పటోళ్ల గోవర్ధన్ రెడ్డి (Patolla Govardhan Reddy) హత్య కేసు (Murder Case)లో శుక్రవారం నాంపల్లి కోర్టు (Nampalli Court) తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. 11 సంవత్సరాల సుదీర్ఘ విచారణ (11 Years Long Trial) తర్వాత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 2012 డిసెంబర్ 27న పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ ఘనపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులను పోలీసులు ఆరెస్టు చేశారు. ఫిబ్రవరి 2018లో ప్రధాన నిందితుడు శేషన్నను ఆరెస్ట్ చేశారు. దీనిపై 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది.