MLA Rajasingh ప్రగతి భవన్‌కు..అరెస్ట్ చేసిన పోలీసులు..
ABN , First Publish Date - 2023-02-10T11:35:20+05:30 IST
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Rajasingh) ప్రగతి భవన్(Pragati Bhavan)కు ..
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Rajasingh) ప్రగతి భవన్(Pragati Bhavan)కు వెళ్లారు. తనకు ఇచ్చిన బల్లెట్ ఫ్రూఫ్(Bullet proof) వాహనం పదే పదే చెడిపోయిందని, ఎన్నిసార్లు చెప్పిన తన బాధ పట్టించుకోవడం లేదని, వాహనాన్ని మార్చాలని సీఎం కేసీఆర్(CM KCR)ను కోరడానికి శుక్రవారం గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రగతి భవన్‌కు వెళ్లారు. అయితే.. పోలీసులు రాజాసింగ్‌ను అడ్డుకోవడంతో తన వెంట తీసుకువచ్చిన బల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని ప్రగతి భవన్ ముందు వదిలేసి వెళ్లారు. ఇదే క్రమంలో రాజాసింగ్‌ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అయితే.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇంటికి వెళుతున్న సమయంలో బుల్లెట్ ప్రూఫ్ కారు (bullet proof car)లో వెళ్తున్న సమయంలో కారు టైర్ ఊడిపోయింది. గతంలో పలుమార్లు కూడా వాహనం ఇబ్బంది పెట్టింది. మరో కారు కేటాయించాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందన లేదని, పాత కారుకే మరమ్మతులు చేసి పంపిస్తున్నారని రాజాసింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే.