Police Dance: గణేశ్ నిమజ్జనంలో పోలీసుల డ్యాన్సులు.. జనం ఫిదా

ABN , First Publish Date - 2023-09-28T14:05:23+05:30 IST

నగరంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేలాదిగా గణేశుని విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు తరలివస్తున్నాయి. గణేశ్ నిమజ్జనం సందర్భంగా యువత డ్యాన్సులతో అదరగొడుతున్నారు. అయితే భక్తులతో పాటు పోలీసులు కూడా కాలు కదిపారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో పాల్గొన్న పలువురు పోలీసులు ఎంతో ఉత్సాహంతో భక్తులతో కలిసి డ్యాన్స్‌లు చేశారు.

Police Dance: గణేశ్ నిమజ్జనంలో పోలీసుల డ్యాన్సులు.. జనం ఫిదా

హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేలాదిగా గణేశుని విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు తరలివస్తున్నాయి. గణేశ్ నిమజ్జనం సందర్భంగా యువత డ్యాన్సులతో అదరగొడుతున్నారు. అయితే భక్తులతో పాటు పోలీసులు కూడా కాలు కదిపారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో పాల్గొన్న పలువురు పోలీసులు ఎంతో ఉత్సాహంతో భక్తులతో కలిసి డ్యాన్స్‌లు చేశారు. ఓ కానిస్టేబుల్ డివైడర్‌పై నిలబడి డీజే సాంగ్స్‌కు స్టెప్పులు వేశారు. గణేశ్ నిమజ్జనోత్సవంలో సదరు కానిస్టేబుల్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కానిస్టేబుల్ డ్యాన్సుకు అక్కడి జనం ఫిదా అయ్యారు. మరికొందరు పోలీసు అధికారులు కూడా భక్తులతో కలిసి స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. నిత్యం భద్రతా చర్యలో నిమగ్నమయ్యే పోలీసులు ఇలా స్టెప్పులు వేయడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


police-dance1.jpg

మరోవైపు.. కాసేపటి క్రితమే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి అయ్యింది. వేలాది మంది భక్తుల నినాదాల మధ్య బడా గణేశ్ గంగమ్మ ఒడికి చేరుకున్నారు. ఆ తరువాత మిగిలిన గణనాథుల నిమజ్జనం కార్యక్రమం కొనసాగుతోంది. గణనాధుడి నామస్మరణతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి. రేపటి (శుక్రవారం) వరకు గణేశ్ నిమజ్జన కార్యక్రమం కొనసాగనుంది.

Updated Date - 2023-09-28T14:10:43+05:30 IST