KA Paul: ఒడిశా రైలు ప్రమాద ఘటన దురదృష్టకరం.. మోడీ రాజీనామా చేయాలి
ABN , First Publish Date - 2023-06-03T14:47:50+05:30 IST
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. రైలు ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని.. వందలాది మంది చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ఒడిశా రైలు ప్రమాదంపై (Odisha Train Accident) ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (Prajashanti Party Chief KA Paul) స్పందించారు. రైలు ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని.. వందలాది మంది చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ప్రధాని మోడీ (Prime Minister Modi) బాధ్యత వహించాలని.. బాధ్యుడిగా ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన అధికారులందరిని విధుల నుంచి తొలగించాలన్నారు. రైల్వేశాఖ మంత్రి ఎవరో ఎవరికీ తెలియదని విమర్శించారు. అన్ని శాఖలను మోడీ తన గ్రిప్‌లో పెట్టుకున్నారు కాబట్టే.. ఈ ఘటనకు కూడా ఆయనే బాధ్యుడని అన్నారు. గత 40 ఏళ్లలో ప్రపంచంలో ఇంత ఘోర ప్రమాదం ఎక్కడా జరగలేదన్నారు. ప్రమాద మృతుల కుటుంబాలకు కేఏ పాల్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.