TS News: మొదలైన ప్రజావాణి.. వినతులు స్వీకరిస్తున్న అధికారులు
ABN , Publish Date - Dec 19 , 2023 | 09:26 AM
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి ప్రజావాణి కార్యక్రమం. ప్రజాభవన్‌లో ప్రతీ మంగళవారం, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు ప్రజాభవన్ ప్రజావాణి కార్యక్రమం మొదలైంది.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి ప్రజావాణి కార్యక్రమం. ప్రజాభవన్‌లో ప్రతీ మంగళవారం, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం మొదలైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజావాణి ఉండనుంది. అయితే ఉదయం నుండే ప్రజలు ఇస్తున్న వినతులను అధికారులు స్వీకరిస్తున్నారు. ఉదయం 10 గంటలలోపు ప్రజాభవన్ చేరుకున్న వారికి వినతులు ఇచ్చే అవకాశం ఉండటంతో భారీగా జనాలు తరలివస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి పలు జిల్లాల నుంచి ప్రజలు ప్రజాభవన్‌కు వస్తున్నారు. ధరణి సమస్యలు, పెన్షన్, డబుల్ బెడ్ రూం సమస్యలపైనే జనం ఎక్కువగా వస్తున్న పరిస్థితి. ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...