Pragathi Bhavan: ప్రగతిభవన్‌కు ప్రకాష్ అంబేడ్కర్.. కేసీఆర్ సాదర స్వాగతం
ABN , First Publish Date - 2023-04-14T15:28:22+05:30 IST
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనమడు, మాజీ లోక్‌సభ సభ్యులు ప్రకాష్ అంబేద్కర్ కాసేపటి క్రితమే ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనమడు, మాజీ లోక్‌సభ సభ్యులు ప్రకాష్ అంబేద్కర్ కాసేపటి క్రితమే ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఆవిష్కరిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రకాష్ అంబేడ్కర్ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే ప్రగతిభవన్‌కు చేరుకున్న ఆయనకు సీఎం ఆహ్వానం పలికారు. శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రకాష్‌తో కేసీఆర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనంతరం మధ్యాహ్నం భోజనంతో అతిథ్యమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, పార్టీనేతలు దాసోజు శ్రవణ్, శంకర్ అన్న ధోంగే, సిద్దోజీరావు తదితరులు పాల్గొన్నారు. మరికాసేపట్లో ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్..డా. బీఆర్ అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లనున్నారు.