Hyderabad: ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌పై మాజీ కార్పొరేటర్ భర్త ఆరోపణలు
ABN , First Publish Date - 2023-06-15T16:59:11+05:30 IST
హైదరాబాద్: నల్లకుంట మాజీ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి ఇంటిని దళిత సంఘాలు ముట్టడించాయి. దళిత బంధు విషయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌పై శ్రీదేవి భర్త గరిగంటి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: నల్లకుంట మాజీ కార్పొరేటర్ (Ex Corporator) గరిగంటి శ్రీదేవి (Gariganti Sridevi) ఇంటిని దళిత సంఘాలు ముట్టడించాయి. దళిత బంధు విషయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ (MLA Kaleru Venkatesh)పై శ్రీదేవి భర్త గరిగంటి రమేష్ (Gariganti Ramesh) అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గరిగంటి రమేష్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు.
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ లబ్దిదారుల నుంచి రూ. 3 లక్షలు కమీషన్ తీసుకున్నారని రమేష్ ఆరోపించడంపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేష్ ఆరోపణలు రుజువు చేయాలని, దళితులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రమేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదుచేయాలన్నారు. రమేష్ బీఆర్ఎస్లో ఉంటూనే బీజేపీకి అమ్ముడుపోయారని దళిత సంఘాలు విమర్శించాయి.