Revanth Reddy : అయ్య ఔరంగాబాద్‌లో.. కొడుకు ప్లీనరీల పేరుతో ఊరేగుతున్నారు

ABN , First Publish Date - 2023-04-26T12:13:17+05:30 IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై విరుచుకుపడ్డారు.

Revanth Reddy : అయ్య ఔరంగాబాద్‌లో.. కొడుకు ప్లీనరీల పేరుతో ఊరేగుతున్నారు

హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై విరుచుకుపడ్డారు. అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే.. అయ్య ఔరంగాబాద్‌లో.. కొడుకు ప్లీనరీల పేరుతో.. రాజకీయ సభలు పెట్టుకుని ఊరేగుతున్నారని విమర్శించారు. వీళ్లకు మానవత్వం ఉందా? అని రేవంత్ ప్రశ్నించారు. బాధ్యత ఉందా... ఇది ప్రభుత్వమేనా... ? అని నిలదీశారు. రైతు - యువత ఏకమై బీఆర్ఎస్‌ను బొందపెట్టే సమయం వస్తుందని రేవంత్ అన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ద ఎత్తున సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీనిని విమర్శిస్తూ రేవంత్ ట్వీట్ చేశారు.

Updated Date - 2023-04-26T12:13:17+05:30 IST