Share News

Revanth: గాంధీ కుటుంబంతో వివేక్‌కు ఎంతో అనుబంధం: రేవంత్

ABN , First Publish Date - 2023-11-01T13:27:55+05:30 IST

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలంటే అంతా కలిసికట్టుగా పనిచేయాలని వివేక్ వెంకటస్వామిని కోరడం జరిగిందని, గాంధీ కుటుంబంతో వివేక్‌కు ఎంతో అనుబంధం ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

Revanth: గాంధీ కుటుంబంతో వివేక్‌కు ఎంతో అనుబంధం: రేవంత్

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ (CM KCR)ను గద్దె దించాలంటే అంతా కలిసికట్టుగా పనిచేయాలని వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy)ని కోరడం జరిగిందని, గాంధీ కుటుంబంతో వివేక్‌కు ఎంతో అనుబంధం ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన నోవోటెల్ హోటల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ వివేక్‌తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫోన్‌లో మాట్లాడి కాంగ్రెస్‌లో చేరాలని కోరారని, ఆయన కోరిక మేరకు ఇవాళ రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారన్నారు.

వివేక్ తిరిగి కాంగ్రెస్‌ (Congress)లో చేరడమంటే ఆయన సొంత కుటుంబంలో చేరినట్లేనని, ఆయన్ను కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని రేవంత్ అన్నారు. వివేక్ చేరిక కాంగ్రెస్‌కు వెయ్యేనుగుల బలాన్ని చేకూర్చిందన్నారు. కీలక సందర్భంలో ఆయన కాంగ్రెస్‌లో చేరడంతో తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ రావాలనే ప్రజల ఆకాంక్షకు వివేక్ చేరిక బలాన్నిస్తుందని రేవంత్ వ్యాఖ్యానించారు.

కాగా ఎన్నికల సమయంలో బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ వివేక్‌తో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఫోన్ చేసి మాట్లాడారు. ‘తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మీలాంటి వాళ్లు కాంగ్రెస్‌లోకి రావాలని కోరారు’ ఖర్గే ఆహ్వానం మేరకు ఇవాళ నోవాటెల్‌లో రాహుల్ గాంధీని కలిసి పార్టీలో చేరారు.

Updated Date - 2023-11-01T13:27:55+05:30 IST