Royal Bengal Tiger: హైదరాబాద్ జూపార్క్‌కు వెళ్లేవారికి ఇకపై ఆ పులి కనిపించదు..!

ABN , First Publish Date - 2023-04-06T10:52:23+05:30 IST

నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కు(Nehru Zoological Park)లో పర్యాటకులను..

Royal Bengal Tiger: హైదరాబాద్ జూపార్క్‌కు వెళ్లేవారికి ఇకపై ఆ పులి కనిపించదు..!

హైదరాబాద్: నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కు(Nehru Zoological Park)లో పర్యాటకులను (Tourists) ఎంటర్‌టైన్ చేసిన ఆ పెద్దపులి ఇకపై కనిపించదు. బుధవారం రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ (Royal Bengal Tiger)మృత్యువాత పడింది. పదేళ్ల వయసు గల ‘‘జో’’ అనే మగ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ఆరు నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధి(Renal Failure)తో బాధపడుతూ మృతిచెందింది.

పులికి తరచుగా ఆకలి తగ్గుతోందని, ఆహారపు అలవాట్లు మారుతున్నాయని, దాని వెనుకభాగం సన్నగా మారిందని నెహ్రూ జూలాజికల్ పార్క్ వైద్యులు తెలిపారు. ఆహారం మార్పులు చేర్పులు చేసి చికిత్స అందిస్తూ వచ్చారు. పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 5న(April 5th) తెల్లవారుజామున 3 గంటలకు ఎన్‌క్లోజర్‌లోనే మృతి చెందింది.

యానిమల్‌ కీపర్లు(Animal Keeper's ) గుర్తించి అధికారులకు సమాచారమందించారు. వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించి ఉన్నధికారులకు నివేదిక అందజేసింది. కాగా జో జూపార్కులోనే నిఖిల్‌, అపర్ణ అనే పులి జంటకు జన్మించింది.

Updated Date - 2023-04-06T10:53:16+05:30 IST