TS NEWS: హైదరాబాద్‌లో సెల్ఫీ వీడియో సూసైడ్.. లోన్ ఆప్స్ వేధింపులతోనే..
ABN , First Publish Date - 2023-09-01T20:13:03+05:30 IST
లోన్ ఆప్స్(Loan apps)కు మరో నిండు ప్రాణం బలైపోయింది. లోన్ ఆప్స్‌లో ఓ యువకుడు కొంత నగదు తీసుకున్నాడు. లోన్ ఆప్స్ నిర్వాహకులు తరచూ ఫోన్లు చేస్తుడడంతో తీవ్ర మనస్తాపంతో సెల్ఫీ వీడియో(Selfie video) తీసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్: లోన్ ఆప్స్(Loan apps)కు మరో నిండు ప్రాణం బలైపోయింది. అత్యవసర నిమిత్తం లోన్ ఆప్స్‌లో ఓ యువకుడు కొంత నగదు తీసుకున్నాడు. లోన్ ఆప్స్ నిర్వాహకులు తీసుకున్న నగదును వెంటనే చెల్లించాలని తరచూ ఫోన్లు చేసి వేధిస్తుడడంతో తీవ్ర మనస్తాపంతో యువకుడు సెల్ఫీ వీడియో(Selfie video) తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాధ ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్ అత్తాపూర్‌లోని మారుతి నగర్‌లో చోటుచేసుకుంది. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్ అత్తాపూర్‌లోని మారుతి నగర్‌లో నివాసం ఉంటున్న సాప్ట్‌వేర్ ఉద్యోగి రామచంద్రరావు సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
‘‘ నన్ను క్షమించండి అంటూ.. తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నేను నా తల్లిదండ్రులకు గాని నా కుటుంబ సభ్యులకు కానీ ఏలాంటి సహాయం చేయలేక చనిపోతున్నా. లోన్ ఆప్స్‌లో తీసుకున్న డబ్బులు కూడా నా తల్లిదండ్రులు కట్టలేక పోతారు. ఈ విషయంపై పోలీసులు లోన్ ఆప్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సెల్ఫీ వీడియోలో విజ్ఞప్తి చేశాడు. నేను చనిపోతున్న నా బాడీలో ఉన్న అవయవాలు ఎవరికైనా ఉపయోగ పడుతాయి’’ అని భావిస్తున్నానని సెల్ఫీ వీడియోలో తెలిపాడు. సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.పోలీసులు లోన్ ఆప్స్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.