Hyderabad: గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో ఊహించని సంఘటన..ప్రయాణికులు బేజార్..ఇంతకీ ఏం జరిగిందంటే?

ABN , First Publish Date - 2023-05-12T12:29:04+05:30 IST

రైలు కదిలి అలా కొంతదూరం వెళ్లింది. ప్రయాణికులు తమతమ సీట్లలో సర్దుకుంటున్నారు.హమ్మయ్యా! సీటు దొరికింది కాదా కాస్త ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందామనుకుంటున్న ప్రయాణికులపై అవి ఒక్కసారిగా ఒక్కసారిగా ..

Hyderabad: గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో ఊహించని సంఘటన..ప్రయాణికులు బేజార్..ఇంతకీ ఏం జరిగిందంటే?

హైదరాబాద్: రైలు కదిలి అలా కొంతదూరం వెళ్లింది. ప్రయాణికులు తమతమ సీట్లలో సర్దుకుంటున్నారు.హమ్మయ్యా! సీటు దొరికింది కాదా కాస్త ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందామనుకుంటున్న ప్రయాణికులపై అవి ఒక్కసారిగా ఒక్కసారిగా దండయాత్ర చేశాయి. ప్రయాణికులను భయాందోళనకు గురిచేశాయి. గురువారం గోల్కోండ ఎక్స్‌ప్రెస్‌(Golconda Express)లో జరిగిన ఆ షాకింగ్ ఇన్సిడెంట్‌కు ప్రయాణికులు ఏంటీ మాకీ తిప్పలు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

వేసవి కాలంలో ప్రశాంతంగా ఊరేళదామనుకుంటే రైలులో బొద్దింకలు, నల్లులు కుడుతుండడంతో ప్రయాణికులు అవస్ధలు పడుతున్నారు. సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు వెళ్లే గోల్కొండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో గురువారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ దాటగానే రైలు వెళ్లే క్రమంలో గాలికి ఒక్కసారిగా నల్లులు(Bedbugs), బొద్దింకలు(Cockroaches) ఏరులై పారుతుండడంతో ప్రయాణికులు హైరాన పడిపోయారు. చిన్నపిల్లలు సైతం భయపడిపోయి ఆందోళనకు గురయ్యారు.

జనరల్‌ బోగీలో కనీసం శుభ్రం లేకపోవడంతో పాటు బెర్తుల కింది భాగం నుంచి ఒక్కసారీగా బెర్తులపై వ్యాపించి నల్లులు కుడుతుండడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇదేం గోస అంటూ కొందరు ప్రయాణికులు జనరల్‌ బోగీలో విధులు నిర్వహిస్తున్న టీసీకి సైతం ఫిర్యాదు చేశారు. కనీసం ప్రయాణికుల భద్రత కల్పించడంలో రైల్వే అధికారులు విఫలమవుతున్నారని ప్రయాణికులు ఆరోపించారు.

Updated Date - 2023-05-12T12:36:23+05:30 IST