Tammineni: బీజేపీకి వ్యతిరేకంగా ఎవరితో కలిసి వెళ్లాలనేది త్వరలోనే ప్రకటిస్తాం
ABN , Publish Date - Dec 30 , 2023 | 05:46 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) ఆరు గ్యారెంటీల అమలు చేస్తుంనందుకు సంతోషంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ( Tammineni Veerabhadram ) పేర్కొన్నారు. శనివారం నాడు డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) ని మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) ఆరు గ్యారెంటీల అమలు చేస్తుంనందుకు సంతోషంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ( Tammineni Veerabhadram ) పేర్కొన్నారు. శనివారం నాడు డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులతో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామని చెప్పారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీఎంని కోరామని అన్నారు. 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు ఇచ్చి సహాయం చేయాలని సూచించామని చెప్పారు.
వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాల కోసం జీవో సవరణ చేయాలన్నారు. పేదలకు ఆక్రమణ భూములకు పట్టాలు ఇచ్చి 5లక్షల సహాయం చేయాలని కోరామన్నారు. షెడ్యూల్ ఎంప్లాయీమెంట్‌కు ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ అనేది అది గత 8 ఏళ్లుగా సవరణ చేయలేదని తెలిపారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం, ఉపాధ్యాయ బదిలీలు, ధరణి పోర్టల్ సవరణలు చేయాలని కోరామన్నారు. ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల భర్తీ, జర్నలిస్ట్ లకు సహాయం చేయాలని కోరినట్లు చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరితో కలిసి వెళ్లాలనేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కౌలు రైతు అంశంపై అఖిల పక్షంలో చర్చిస్తారనే అంశం సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారన్నారు. రైతు కూలీకి ప్రభుత్వం రోజుకు కనీసం 600 రూపాయలు ఇవ్వాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.