TS Assembly LIVE: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం
ABN , Publish Date - Dec 16 , 2023 | 11:05 AM
Telangana: చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పదేళ్లు ఎన్నో నిర్బంధాలకు గురి అయ్యామన్నారు.
హైదరాబాద్: చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి (MLA Rammohan Reddy)ప్రతిపాదించారు. సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పదేళ్లు ఎన్నో నిర్బంధాలకు గురి అయ్యామన్నారు. ప్రజల కోసం ఎదైనా నిరసనకు పిలుపునివ్వగానే ఇంటి ముందు పోలీసులు ఉండే వాళ్ళన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన 24 గంటల్లోనే ప్రగతి భవన్ కంచెలు తొలగించారన్నారు. గత ప్రభుత్వం ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవాళ్ళని.. తాము అర్హులైన అందరికీ ఇస్తామని చెప్పారు.
వచ్చే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. వికారాబాద్, పరిగి సెగ్మెంట్‌లో గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్ రూమ్‌ను ప్రారంభించలేదన్నారు. ఫార్మసీటి రద్దు చేస్తామని.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తామని తెలిపారు. ధరణి ప్లేస్ భూమాత ఏర్పాటు చేస్తామని.. బెల్ట్ షాప్‌లను రద్దు చేస్తామన్నారు. బీసీ కుల గణన చేస్తామని.. ప్రతి జిల్లాకు బీసీ భవన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గతంలో అభివృద్ధి కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అయిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తమ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...