Kishan Reddy: హుటాహుటిన ఢిల్లీకి కిషన్‌రెడ్డి.. అందుకోసమేనా?..
ABN , First Publish Date - 2023-10-02T11:52:08+05:30 IST
కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు (మంగళవారం) నిజామాబాద్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తోన్న నేపథ్యంలో కిషన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ అభ్యర్థుల కసరత్తు కోసమే తెలంగాణ బీజేపీ చీఫ్ ఢిల్లీ వెళ్లినట్లు బీజేపీలో జోరుగా చర్చ జరుగుతోంది.
హైదరాబాద్: కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు (మంగళవారం) నిజామాబాద్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) వస్తోన్న నేపథ్యంలో కిషన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ అభ్యర్థుల కసరత్తు కోసమే తెలంగాణ బీజేపీ చీఫ్ ఢిల్లీ వెళ్లినట్లు బీజేపీలో జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యనేతల అభ్యర్థిత్వాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం ఖరారు చేయనున్నట్లు సమాచారం..
రేపు నిజామాబాద్‌కు మోడీ
మరోవైపు నిజామాబాద్‌లో పర్యటించనున్న మోదీ ఆరు వేల కోట్లతో ఎన్టీపీసీ నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును జాతికి అంకితం ఇవ్వనున్నారు. అనంతరం నిజామాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో బహిరంగ సభలో పాల్గొంటారు. వర్షం కురిసినా రెండు లక్షల మందికి ఇబ్బందులు కలగకుండా ఉండేలా భారీ టెంట్లు ఏర్పాట్లు చేశారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానం ఇప్పటికే ఎస్పీజీ స్వాధీనంలోకి వెళ్లిపోయింది. ముందు ఇందూరు జనగర్జన సభ.. పసుపు బోర్డు ప్రకటనతో ధన్యవాద్ సభగా పేరు మార్చారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు హెలికాప్టర్‌లో ప్రధాని నిజామాబాద్ రానున్నారు. కొత్త కలెక్టరేట్‌లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఐదు గంటల వరకూ అభివృద్ధి కార్యక్రమం సభలో ప్రధాని పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను ఎంపీ అరవింద్ పరిశీలించారు. ఎనిమిది వేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.