TS DGP: పోలీస్ సర్వీసెస్‌లో తెలంగాణ ఫస్ట్
ABN , First Publish Date - 2023-10-21T09:30:53+05:30 IST
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోశామహల్ స్టేడియంలో ఫ్లాగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అంజనికుమార్, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, ఇతర పోలీస్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు డీజీపీ, పోలీస్ ఆఫీసర్స్ నివాళులర్పించారు.
హైదరాబాద్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోశామహల్ స్టేడియంలో ఫ్లాగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అంజనికుమార్ (DGP Anjanikumar), హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య Hyderabad CP Sandeep Sandilya), ఇతర పోలీస్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు డీజీపీ, పోలీస్ ఆఫీసర్స్ నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ కంటింజెంట్స్ పరేడ్ నిర్వహించారు. అనంతరం డీజీపీ అంజనికుమార్ మాట్లాడుతూ... ఈ ఏడాది దేశవ్యాప్తంగా 189 పోలీసులు అమరులయ్యారన్నారు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు విధి నిర్వహణలో తమ ప్రాణాలు వదిలారని తెలిపారు. పోలీస్ సర్వీసెస్‌లో తెలంగాణ ముందుందని చెప్పారు. భరోసా సెంటర్ దేశంలో రోల్ మోడల్‌గా ఉందన్నారు. ప్రజలు కుటుంబాలతో పండుగలు చేసుకుంటే.. పోలీసులు మాత్రం రోడ్లపై డ్యూటీలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తెలంగాణలో క్రైం రేట్ తగ్గుతూ వస్తోందన్నారు. విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. డే అండ్ నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. కరోనా టైంలో పోలీసులు 24 గంటలు డ్యూటీలు చేశారని.. కరోనా టైంలో పోలీస్ ఆఫీసర్స్ ప్రాణాలు వదిలారని డీజీపీ అంజనీకుమార్ గుర్తుచేశారు.