T.Highcourt: గ్రూప్- 1 పరీక్షల ఫలితాలు ప్రకటించొద్దు.. టీ.హైకోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2023-07-25T14:19:23+05:30 IST

గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు సోమవారం వరకు ప్రకటించొదంటూ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్‌ -1 పరీక్షకు సంబంధించి ఎన్‌ఎస్‌యూఐతో పాటు పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

T.Highcourt: గ్రూప్- 1 పరీక్షల ఫలితాలు ప్రకటించొద్దు.. టీ.హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: గ్రూప్ - 1 పరీక్షల ఫలితాలు (Group 1 Exams Resut) సోమవారం వరకు ప్రకటించ వద్ధంటూ తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) ఆదేశించింది. గ్రూప్‌ -1 పరీక్షకు సంబంధించి ఎన్‌ఎస్‌యూఐతో పాటు పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్‌-1 పరీక్షలో బయోమెట్రిక్ పెట్టలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. త్వరలో గ్రూప్ - 1 ఫలితాలు ప్రకటించేందుకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) యోచిస్తోందని కోర్టుకు పిటిషనర్లు తెలిపారు. ఫలితాలు ప్రకటించకుండా స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్‌పై సోమవారం అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని కోర్టుకు ఏజీపీ తెలిపారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తదుపరి విచారణ జరిగే వరకు గ్రూప్ - 1 ఫలితాలు ప్రకటించవద్దని హైకోర్ట్ ఓరల్ ఆర్డర్ జారీ చేసింది.

Updated Date - 2023-07-25T14:19:23+05:30 IST