Osmania University: ఓయూలో తీవ్ర ఉద్రిక్తత.. ఓయూ గేట్లు మూసేసిన అధికారులు

ABN , First Publish Date - 2023-03-24T14:14:22+05:30 IST

ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Osmania University: ఓయూలో తీవ్ర ఉద్రిక్తత.. ఓయూ గేట్లు మూసేసిన అధికారులు

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University ) లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ (TSPSC Paper Leakage) అంశంపై ఉస్మానియా యూనిర్సిటీ విద్యార్థులు (OU Students) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నేడు, రేపు ఆర్ట్స్ కాలేజీ ముందు మహా దీక్షకు విద్యార్థులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఓయూలోని ఆర్ట్స్‌ కాలేజీ (Arts Collage) కి విద్యార్థులు పలు దఫాలుగా వస్తున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు ఓయూ గేట్లను మూసివేశారు. లోపలికి ఎవరిని అనుమతించేందుకు నిరాకరిస్తున్నారు.

ప్రస్తుతం ఓయూలో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష సమయం కాగానే పెద్ద ఎత్తున ఆందోళనలు చేయనున్నట్లు విద్యార్థులు ప్రకటించారు. మధ్యాహ్నం ఓయూలో మహాదీక్ష చేస్తామని విద్యార్థి సంఘాలు చెబుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనే మహాదీక్ష చేసి తీరుతామని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఓయూలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరం నెలకొంది. పలువురు విద్యార్థులు పూలదండలతో ఆర్ట్స్ కాలేజీ మెట్ల దగ్గర దీక్షకు కూర్చుకున్నారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని దీక్ష కూర్చున్న విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో నగేష్ అనే విద్యార్థి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

ou-students-2.jpg

మరోవైపు ఓయూలో ఉదయం నిరుద్యోగ మార్చ్, మధ్యాహ్నం నిరసన దీక్ష ఉన్న సందర్భంగా ఓయూలో విద్యార్థి నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. వసథిగృహల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నిరుద్యోగ విద్యార్థి మార్చ్ నిర్వహిస్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-03-24T14:28:03+05:30 IST