TSPSC Leakage: చంచల్‌గూడ జైల్లో టీఎస్‌పీఎస్సీ లీకేజ్ ప్రధాన నిందితుల విచారణ
ABN , First Publish Date - 2023-04-17T11:49:29+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితులను ఈరోజు ఈడీ విచారించనుంది.
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు (TSPSC Paper Leakage Case) లో ప్రధాన నిందితులను ఈరోజు ఈడీ విచారించనుంది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌ను విచారించేందుకు కాసేపటి క్రితమే ఈడీ అధికారులు (ED Officers) జైలుకు చేరుకున్నారు. నాంపల్లి కోర్టు అనుమతి మేరకు ఈడీ అధికారులు జైలులో ప్రధాన నిందితులను విచారణ చేయనున్నారు. నలుగురు సభ్యుల ఈడీ అధికారుల బృందం చంచల్ గూడ జైలు చేరుకుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ జరుగనుంది. నిందితుల తరపు న్యాయవాది సమక్షంలో విచారించాలని ఈడీకి ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే జైలుకు ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్, మొబైల్స్‌ను కోర్టు అనుమతించింది. ఈడీ అధికారులకు వసతులు ఏర్పాటు చేయాలని జైలు సూపరింటెండెంట్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నలుగురు ఈడీ బృందం వెళ్లి విచారించడానికి న్యాయస్థానం అనుమతించింది. మనీ లాండరింగ్ కోణంలో ఇద్దరు నిందితులను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈరోజు, రేపు చంచలగూడ జైల్లోనే ఈకేసులో ప్రధాన నిందితుల వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు.