CBI ఆఫీసుకు చేరుకున్న అవినాష్, భాస్కర్ రెడ్డి, ఉదయ్.. విచారణ ప్రారంభం..
ABN , First Publish Date - 2023-04-21T10:42:44+05:30 IST
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy), భాస్కర్ రెడ్డి (Bhaskarreddy), ఉదయ్ కుమార్ రెడ్డి (Udaykumarreddy) సీబీఐ కార్యాలయాని (CBI Office)కి చేరుకున్నారు. మూడు రోజు శుక్రవారం అధికారులు వారిని విచారించనున్నారు. ఈ నేపథ్యంలో వారి న్యాయవాదులు కూడా సీబీఐ ఆఫీసుకు చేరుకోవడంతో విచారణ ప్రారంభమైంది.
మొదటి రోజు బుధవారం తొమ్మిది గంటలు.. రెండవ రోజు గురువారం ఎనిమిది గంటలపాటు విచారణ కొనసాగింది. శుక్రవారం కూడా సాయంత్రం వరకు విచారణ జరుగుతుంది. ఈ సందర్భంగా అవినాష్ రాజకీయ ఏంట్రీ, ఆర్ధిక లావాదేవీలు, హత్య జరిగిన రోజు పరిణామాలు, నిందితులతో పరిచయాలు, హత్యలో తన తండ్రి భాస్కర్ రెడ్డి పాత్ర, హత్య తరువాత వైఎస్ భారతికి ఫోన్ చేయడం, గుండె పోటు, సహజ మరణం అని చెప్పడం, వీటన్నిటిపై సీబీఐ అధికారులు కూపి లాగుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు ముగ్గురిని వేరు వేరుగా విచారించి.. అనంతరం భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డితో కలిపి అవినాష్‌ను విచారణ చేయనున్నారు.