Share News

Revanth Reddy: కేసీఆర్ జైల్లోకి వెళ్లే పరిస్థితి వచ్చింది

ABN , First Publish Date - 2023-10-26T15:29:10+05:30 IST

మేడిగడ్డ విషయంలో కేసీఆర్ లాజిక్, కామన్ సెన్స్ కోల్పోయారనే అనుమానం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy: కేసీఆర్ జైల్లోకి వెళ్లే పరిస్థితి వచ్చింది

న్యూఢిల్లీ: మేడిగడ్డ విషయంలో కేసీఆర్ (CM KCR) లాజిక్, కామన్ సెన్స్ కోల్పోయారనే అనుమానం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పేలుడు పదార్థాలు పెడితే గాల్లోకి లేస్తాయి తప్ప, భూమిలోకి కుంగవన్నారు. బొగ్గుగనులు ఉండటం వల్లే కుంగాయన్నారు. సయిల్ టెస్ట్ చేయించకుండా కక్కుర్తి పడి గాల్లో మేడలు కట్టినట్లు కట్టారని మండిపడ్డారు. ఎల్ అండ్ టీని కాపాడేందుకు సంఘ విద్రోహ శక్తులపై నేపాన్ని నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్ జైల్లోకి వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. సంక్షేమాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. నివేదికను ఎందుకు కేంద్రం బయటపెడుతాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, మోడీల లాలూచీ బయటపడిందన్నారు. కేసీఆర్‌ను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని ఆరోపించరాు. అరెస్ట్ చేసి విచారణ చేయాలా, సీబీఐ విచారణ చేయాలా అనేది నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సీఎన్సీ మురళీధర్ రావు ఎవరో, ఆయనకు కేసీఆర్ ఉన్న బంధం ఏందో అందరికి తెలుసన్నారు. 12 ఏళ్ల కింద రిటైర్డ్ అయిన అధికారికి కీలక బాధ్యతలు ఎలా ఇస్తారని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు.


కుల సంఘ నేను కాపాడేందుకు మురళీధర్ రావు స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. క్రిమినల్ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తేనే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. ఢిల్లీలోని చక్రవర్తి మోడీకి కేసీఆర్ కప్పం కడుతున్నందుకే కాపాడుతున్నారని విమర్శించారు. హరీష్, కేటీఆర్, కేసీఆర్ చార్లెస్ శోబరాజ్ రకమని... వాళ్లెప్పుడు వాళ్ళ తప్పులను ఒప్పుకోరన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ దాడులు ఉండవన్నారు. తెలంగాణలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ లేదని చెప్పారు. ఎన్నికల వేళా బీజేపీ వాటి అనుబంధ సంస్థలను పంపించడం ఆనవాయితీగా వస్తున్నదే అని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ ఎప్పుడు చేరుతారో ఆయనే చెప్తారని.. వారికి ఆ స్వేచ్ఛ ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చర్యలు తీసుకుంటుందేమోననే కోమటిరెడ్డి రాజగోపాల్, వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, విజయశాంతి లాంటివారు బీజేపీలో చేరారని వ్యాఖ్యలు చేశారు. అందులో చేరాకే బీఆర్‌ఎస్, బీజేపీల బంధంపై వారికి స్పష్టత వచ్చిందన్నారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకోకపోవడం వల్లే కొంతమంది బీజేపీని వీడారన్నారు. కాంగ్రెస్లోకి వచ్చేవాళ్లను సాదరంగా ఆహ్వానిస్తున్నామని.. వారి స్థాయికి తగ్గట్లు వారిని గౌరవిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-10-26T15:29:10+05:30 IST