TSPSC Leakage: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై 28న తీర్పిస్తామన్న హైకోర్టు
ABN , First Publish Date - 2023-04-24T12:39:56+05:30 IST
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై (TSPSC Paper Leakage) హైకోర్టులో (Telangana High Court) విచారణ వాయిదా పడింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును సీబీఐకి ఇవ్వాలన్న కాంగ్రెస్ (Congress) పిటిషన్‌పై సోమవారం ఉదయం విచారణ జరిగింది. ఇప్పటికే పేపర్ లీకేజీపై సిట్ నివేదికను సమర్పించింది. విచారణలో భాగంగా పిటిషనర్ తరుపున కాంగ్రెస్ సెల్ ఇంఛార్జి వివేక్ థన్కా వాదనలు వినిపించారు. అయితే ఈ పిటిషన్‌ను ఇంత హడావుడిగా విచారించాల్సిన అవసరం లేదని ఏజీ తెలిపారు. ఇంకా ఎఫ్‌ఎస్ఎల్ రిపోర్ట్ రావాల్సి ఉందని, కేసు దర్యాప్తు సిట్ జరుపుతోందని.. విచారణ కొనసాగుతోందని వివరించారు. ఇప్పటికే సిట్ నివేదికను సమర్పించామని, అడిషనల్ నివేదిక సబ్మిట్ చేస్తామని చెప్పారు. ఇప్పటికిప్పుడు విచారణ అవసరం లేదని ఏజీ కోర్టుకు తెలియజేశారు. అయిత తమ వాదన వినాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఐదు సుప్రీం కోర్టు తీర్పులను వివేక్ థన్కా చదివి వినిపించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈరోజు తీర్పు ఇస్తామని హైకోర్టు తెలియజేసింది.