Hyderabad: ఆర్టీసీ కళా భవన్‌ను సీజ్ చేసిన టీఎస్‌ఆర్టీసీ
ABN , First Publish Date - 2023-04-27T15:30:47+05:30 IST
హైదరాబాద్: ఆర్టీసీ కళా భవన్ (RTC Kala Bhavan)ను టీఎస్‌ఆర్టీసీ (TSRTC) అధికారులు సీజ్ (seize) చేశారు. సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ...
హైదరాబాద్: ఆర్టీసీ కళా భవన్ (RTC Kala Bhavan)ను టీఎస్‌ఆర్టీసీ (TSRTC) అధికారులు సీజ్ (seize) చేశారు. సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Suchirindia Hotels and Resorts Pvt)తో అద్దె కాంట్రాక్టును టీఎస్‌ఆర్టీసీ రద్దు చేసింది. 2016లో టీఎస్‌ఆర్టీసీకి చెందిన ఆర్టీసీ కళాభవన్‌ను సుచిరిండియా అద్దెకు తీసుకుంది. ఆ భవన్‌లో కల్యాణమండపం, కళా భవన్, మరో మూడు మినీహాళ్లు లీజ్‌కు తీసుకుంటూ ఒప్పందం కుదుర్చుకుంది.
ఒప్పందం ప్రకారం నెలకు రూ. 25.16 లక్షలను టీఎస్‌ఆర్టీసీకి సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెల్లించాలి. అయితే గత కొంత కాలంగా సుచిరిండియా సంస్థ అద్దె సకాలంలో చెల్లించక పోవడంతో మొత్తం రూ. 6.55 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ బకాయిలను చెల్లించాలని టీఎస్‌ఆర్టీసీ అధికారులు పలుమార్లు సుచిరిండియాకు నోటీసులు పంపారు. ఆ నోటీసులకు సుచిరిండియా సంస్థ స్పందించకపోవడంతో.. కళాభవన్‌ను టీఎస్‌ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. ఒప్పందం ప్రకారం నెల నెల అద్దె చెల్లించకుంటే నోటీసులు జారీ చేసి.. ఆర్టీసీ కళాభవన్‌ను టీఎస్‌ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకోవచ్చునని అగ్రిమెంట్‌లో ఉంది.