TS Assembly: ఉభయ సభల్లో రెండు కీలక పేపర్స్ టేబుల్

ABN , First Publish Date - 2023-08-06T09:40:52+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగోరోజు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఉభయ సభలు.. శాసనసభ, శాసనమండలిలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఉభయ సభల్లో ఈ రోజు రెండు కీలక పేపర్స్ టేబుల్ చేయనున్నారు.

TS Assembly: ఉభయ సభల్లో రెండు కీలక పేపర్స్ టేబుల్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Meetings) నాలుగోరోజు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఉభయ సభలు.. శాసనసభ, శాసనమండలిలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఉభయ సభల్లో ఈ రోజు రెండు కీలక పేపర్స్ టేబుల్ (Key Papers Table) చేయనున్నారు. 1. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు (Harish Rao) మార్చి 2022 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ (Cog) రిపోర్టును సభకు సమర్పిస్తారు. 2. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) ట్రాన్స్‌పోర్టు రోడ్ అండ్ బిల్డింగ్ శాఖకు సంబంధించిన పేపర్స్‌ను టేబుల్ చేయనున్నారు.

అలాగే శాసనసభ, మండలిలో స్వల్పకాలిక చర్చను ఒకే అంశంపై చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఉభయ సభల్లో స్వల్పకాలిక చర్చలో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు. బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో సాధించిన ప్రగతిపై సీఎం కేసీఆర్ మాట్లాడతారు. కాగా నిన్న (శనివారం) శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించిన ఐదు బిల్లులను ఇవాళ శాసనమండలిలో ప్రవేశపెట్టి, చర్చించి ఆమోదించనున్నారు.

శాసనమండలిలో నేడు ఆమోదించే బిల్లులు...

1. ది తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బిల్ 2023ను ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశపెడతారు. దీనిపై చర్చించి మండలి ఆమోదం కోరనున్నారు.

2. ది ఫ్యాక్టరీస్ అమెండ్‌మెంట్ బిల్ 2023ను కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చర్చకు ప్రవేశపెట్టి మండలి ఆమోదం కోరనున్నారు.

3. తెలంగాణ మైనార్టీ కమిషన్ సవరణ బిల్లు 2023ను మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ చర్చకు ప్రవేశపెట్టి మండలి ఆమోదం కోరనున్నారు.

4. ది తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చట్ట సవరణ బిల్లు 2023ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి మండలి ఆమోదం కోరనున్నారు.

5. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు 2023ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శాసనమండలిలో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదం కోరనున్నారు. కాగా శాసనసభ, శాసనమండలి ఎజెండాలో ఆర్టీసీ విలీన బిల్లు లేదు.

Updated Date - 2023-08-06T09:40:52+05:30 IST