Balka Suman: చదువురాని సన్నాసి బండి సంజయ్ : ఎమ్మెల్యే సుమన్
ABN , First Publish Date - 2023-04-07T14:12:40+05:30 IST
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నామని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Telangana State BJP President Bandi Sanjay) మాట్లాడిన తీరును ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్(BRS MLA Balka Suman)వ్యాఖ్యానించారు. ఉదయం కరీంనగర్ జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియాతో సంజయ్ మాట్లాడిన మాటలపై బాల్కసుమన్ స్పందించారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ..‘‘సంజయ్ విడుదలై అదే తిట్ల పురాణం అందుకున్నారు. బండి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈయన ఏదో ఘనకార్యం చేసినట్టు ఢిల్లీ పెద్దలు ఫోన్లు చేస్తున్నారు. సింగరేణి ప్రైవేటీకరణపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. తేదీల వారీగా కేంద్రం బొగ్గు బ్లాకులని వేలం పెట్టిన ఆధారాలు ఉన్నాయి. 2021లో ప్రధాని మోదీకి(Prime Minister Modi) సీఎం కేసీఆర్(Cm Kcr) లేఖ రాశారు. లేఖ రాసినప్పటికీ సింగరేణికి బొగ్గు బ్లాకులు ఇవ్వలేదు. సింగరేణికి బొగ్గు గనులు ఇవ్వకపోవడం వల్ల కార్మికులు భారీగా నష్టపోతున్నారు. ఇన్ని ఎన్నిసార్లు లేఖలు ఇచ్చినా..సిగ్గులేకుండా వేలం పెట్టారు. చదువు రాని సన్నాసి బండి సంజయ్ ఉదయం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రధాని చెప్పిన మాట.. ఇచ్చిన హామీ పైనా కూడా నిలబడలేదు’’ అంటూ బాల్కసుమన్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.