Kishan Reddy: మీ రాజీనామా మేము కోరుకోవడం లేదు.. కానీ
ABN , First Publish Date - 2023-01-31T12:10:36+05:30 IST
బీఆర్ఎస్ నేతలు ప్రధానికి, రాష్ట్రపతికి, గవర్నర్‌కు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) ప్రధానికి, రాష్ట్రపతికి, గవర్నర్‌కు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఈటల రాజేందర్ (BJP MLA Etela Rajender) గెలిచినప్పటి నుంచి ఒక్క రోజు కూడా సభలో అడుగుపెట్టకుండా చేశారని మండిపడ్డారు. సెషన్ (Telangana Assembly Session) మొత్తం సస్పెండ్ చేసి సభకు రాకుండా అడ్డుకున్నారన్నారు. అంత గొప్ప మహానుభావులు తమకు రాజకీయాల గురించి, హక్కుల గురించి నీతులు చెబుతున్నారని యెద్దేవా చేశారు. ఇప్పుడేమో ఆ పార్టీ నేతలు రాజీనామా చేస్తామని అంటున్నారన్నారు. ‘‘మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. మేము కోరుకోవడం లేదు. కానీ కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జనమే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు’’ అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.