Share News

Vijayashanthi: రాములమ్మకు ఇది అవమానమేనా?

ABN , First Publish Date - 2023-11-06T14:33:23+05:30 IST

ఈ లిస్ట్‌లో ప్రధాని మోదీ, నడ్డా, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప సహా పలువురు జాతీయ నేతలు ఉన్నారు.

Vijayashanthi: రాములమ్మకు ఇది అవమానమేనా?

హైదరాబాద్: విజయశాంతి (Vijayashanthi) ఒకప్పుడు స్టార్ క్యాంపెయినర్. ఆమె అభిమానులందరూ ముద్దుగా రాములమ్మ అని పిలుచుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. అంతటి ఫాలోయింగ్ ఉన్న ఆమె పట్ల పువ్వు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది వ్యూహాత్మకమా? లేదంటే పక్కా ప్లాన్‌తో ఇలా చేశారో తెలియదు గానీ.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో రాములమ్మ ఊసే కనిపించలేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఆమే స్టార్ క్యాంపెయినర్. అలాంటిది కాషాయ పార్టీ మాత్రం ఆమెను పక్కనపెట్టేసింది. దీనికి ఈ పార్టీ సీనియర్లు కొందరు గట్టు దాటడమే కారణంగా తెలుస్తోంది. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఊహించని విధంగా హస్తం గూటికి చేరిపోయారు. అదే కోవలో విజయశాంతి కూడా ఉన్నట్లు కమలం పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో రాములమ్మకు చోటు దక్కనట్లుగా సమాచారం.

40 మందితో బీజేపీ లిస్టు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున 40 మంది ప్రచారం చేయనున్నారు. ఈ లిస్ట్‌లో ప్రధాని మోదీ, నడ్డా, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప సహా పలువురు జాతీయ నేతలు ఉన్నారు. క్యాంపెయినర్ లిస్ట్‌లో రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల, రాజాసింగ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఎంపీ అర్వింద్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరెడ్డి తదితరులు ఉన్నారు.

మార్పు ఖాయమా?

బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో విజయశాంతికి చోటు దక్కలేదు. పైగా అభ్యర్థిగా ఏ నియోజకవర్గం కూడా కేటాయించలేదు. మరీ బీజేపీలో ఉంటారా? లేదంటే గట్టు దూకేస్తారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

WhatsApp Image 2023-11-06 at 1.50.47 PM.jpeg

Updated Date - 2023-11-06T14:34:31+05:30 IST