Vijayashanti: బీజేపీలో రాములమ్మ ట్వీట్స్ కలకలం.. పార్టీలో జోరుగా చర్చ

ABN , First Publish Date - 2023-07-25T14:27:56+05:30 IST

తెలంగాణ బీజేపీలో ఆ పార్టీనేత విజయశాంతి చేసిన ట్వీట్స్ కలకలం రేపుతున్నాయి. మణిపూర్ అల్లర్ల ఘటనలో నేరస్థులకు ఉరి శిక్ష వేయాలని రాములమ్మ డిమాండ్‌ చేశారు. మ

Vijayashanti: బీజేపీలో రాములమ్మ ట్వీట్స్ కలకలం.. పార్టీలో జోరుగా చర్చ

హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో ఆ పార్టీనేత విజయశాంతి (BJP Leader Vijayashanti) చేసిన ట్వీట్స్ కలకలం రేపుతున్నాయి. మణిపూర్ అల్లర్ల ఘటనలో నేరస్థులకు ఉరి శిక్ష వేయాలని రాములమ్మ డిమాండ్‌ చేశారు. మణిపూర్ ఘటన యావత్ దేశం సిగ్గుతో తల దించుకునేలా ఉందని విజయశాంతి అన్నారు. అయితే మోదీ ప్రభుత్వాన్ని (Modi Government) ప్రశ్నించేలా విజయశాంతి ట్వీట్ ఉందని సొంత పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అలాగే తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్ రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy)బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మాజీ సీఎం కిరణ్‌ను (Former Chief Minister Kiran Kumar) పిలవటాన్ని కూడా రాములమ్మ తప్పుబట్టినట్లు తెలుస్తోంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

ఈ క్రమంలో బహిరంగ సభ నుంచి మధ్యలోనే విజయశాంతి వెళ్ళిపోయారు. బండి సంజయ్‌ను (Bandi Sanjay) అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించటాన్ని కూడా బీజేపీ నేత తప్పుబట్టారు. దీంతో విజయశాంతి తీరుపై బీజేపీ నేతలే చర్చించుకునే పరిస్థితి నెలకొంది. స్వపక్షంలో విపక్షం మాదిరి విజయశాంతి వ్యవహరిస్తున్నారని కమలం పార్టీలో నేతలు చర్చించుకుంటున్నట్లు సమాచారం.

Updated Date - 2023-07-25T14:37:39+05:30 IST