Viveka Case : నేటితో ముగిసిన నిందితుల రిమాండ్.. సీబీఐ కోర్టు ఏం చెప్పిందంటే..

ABN , First Publish Date - 2023-06-30T11:47:14+05:30 IST

వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న వివేకా హత్య కేసు నిందితులను పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వైఎస్ వివేకా హత్య కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌ను సీబీఐ అధికారులు దాఖలు చేశారు. నాంపల్లి సీబీఐ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. జులై 14 వరకూ సీబీఐ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. నిందితులను చంచల్ గూడ జైల్‌కు పోలీసులు తరలించునున్నారు.

Viveka Case : నేటితో ముగిసిన నిందితుల రిమాండ్.. సీబీఐ కోర్టు ఏం చెప్పిందంటే..

Viveka Case : వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న వివేకా హత్య కేసు నిందితులను పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వైఎస్ వివేకా హత్య కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌ను సీబీఐ అధికారులు దాఖలు చేశారు. నాంపల్లి సీబీఐ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. జులై 14 వరకూ సీబీఐ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. నిందితులను చంచల్ గూడ జైల్‌కు పోలీసులు తరలించునున్నారు.

నేడు కోర్టుకు ఎర్ర గంగిరెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ ఉదయకుమార్, భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. దస్తగిరి మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. సీబీఐ కోర్టులో అధికారులు అనుబంధ చార్జ్ షీట్‌ను దాఖలు చేశారు. ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్‌లు సీబీఐ దాఖలు చేసింది. ఈ రోజు దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌తో కలిపి మొత్తం 3 ఛార్జ్ షీట్‌లు దాఖలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే సీబీఐ కోర్టు నిందితులకు రిమాండ్ పొడిగించింది. తదుపరి విచారణ జూలై 14 కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2023-06-30T12:18:10+05:30 IST