Viveka Murder Case : సీబీఐ చార్జ్‌షీట్‌ను వెనక్కి పంపిన కోర్టు

ABN , First Publish Date - 2023-07-11T12:35:54+05:30 IST

వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ను టెక్నికల్ తప్పిదాల కారణంగా సీబీఐ కోర్టు వెనక్కి పంపించింది. దీంతో సీబీఐ మళ్లీ ఛార్జ్ షీట్‌ను రీసబ్మిట్ చేసింది.

Viveka Murder Case : సీబీఐ చార్జ్‌షీట్‌ను వెనక్కి పంపిన కోర్టు

Viveka Murder Case : వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ను టెక్నికల్ తప్పిదాల కారణంగా సీబీఐ కోర్టు వెనక్కి పంపించింది. దీంతో సీబీఐ మళ్లీ ఛార్జ్ షీట్‌ను రీసబ్మిట్ చేసింది. హైకోర్టులో దస్తగిరి అప్రూవర్‌పై వేసిన పిటిషన్‌పూ విచారణ జరగనుంది. ఛార్జ్ షీట్ రీ సబ్మిట్ చేసినట్టు కోర్టుకు సీబీఐ తెలిపింది.

వివేకా కేసులో సీబీఐ ఏం తేల్చిందంటే..!

మరోవైపు.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ముందస్తు కుట్ర ప్రకారమే జరిగిందని సీబీఐ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. నిందితులు ఎర్రగంగిరెడ్డి, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నారని.. తర్వాత సాక్ష్యాల ధ్వంసంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి పాల్గొన్నట్లు తెలిపింది. అవినాశ్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా చేరుస్తూ హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో దర్యాప్తు సంస్థ శుక్రవారం అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. ఇప్పటికే అరెస్టయిన ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని ఏ7గా, ఆయన సన్నిహితుడు ఉదయ్‌కుమార్‌రెడ్డిని ఏ6గా పేర్కొంది. వాస్తవానికి ఈ వివరాలను ఇదివరకు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లోనే తెలియజేసింది. చార్జిషీటులో పేర్కొనడం మాత్రం ఇదే ప్రథమం. ఇందులో ఏ9 పేరును సైతం చేర్చే అవకాశం ఉందని తొలుత ప్రచారం జరిగినా.. చార్జిషీటులో దర్యాప్తు సంస్థ దానిని ప్రస్తావించలేదు.

Updated Date - 2023-07-11T12:35:54+05:30 IST