Sharmila: విజయసాయితో జరిగిన సంభాషణపై మాట్లాడేందుకు షర్మిల నిరాకరణ..

ABN , First Publish Date - 2023-02-20T16:29:46+05:30 IST

తారక రత్నా నివాసంలో ఎంపీ విజయసాయి రెడ్డితో జరిగిన సంభాషణపై సమాధానం చెప్పేందుకు వైఎస్ షర్మిల నిరాకరించారు.

Sharmila: విజయసాయితో జరిగిన సంభాషణపై మాట్లాడేందుకు షర్మిల నిరాకరణ..

హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల (Sharmila).. నటుడు తారకరత్న (Tarakaratna) భౌతికకాయానికి నివాళులర్పించేందుకు మోకిలోని ఆయన నివాసానికి వెళ్లినప్పుడు అక్కడ వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)తో జరిగిన సంభాషణపై సమాధానం చెప్పేందుకు ఆమె నిరాకరించారు. ఈ సందర్భంగా సోమవారం షర్మిల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ తెలంగాణ (Telangana)లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై త్వరలో రాష్ట్రపతి (President)కి ఫిర్యాదు చేస్తామన్నారు. తనకు, తన పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) మాపై విమర్శలు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు.

బీఆర్ఎస్ పార్టీ ఎమెల్యేలు, మంత్రులపై విచారణ జరపాలని షర్మిల డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అక్రమాలపై తాను మాట్లాడుతున్నాను కాబట్టే ఇవన్నీ చేస్తున్నారని ఆమె అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ (CBI), గవర్నర్‌ (Governor)కు ఫిర్యాదు చేశానని, దానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP)లకు దమ్ము ఉంటె సీఎం కేసీఅర్ (CM KCR) పై

పోరాటం చేయాలన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడుల్లో తెలంగాణ ముందుందని అన్నారు. పాదయాత్ర బ్రేక్‌పై ఇవాళ కోర్టుకు వెళ్ళామని, మళ్ళీ తిరిగి వరంగల్ జిల్లాలోనే పాదయాత్ర (Padayatra) ఉంటుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

Updated Date - 2023-02-20T16:29:51+05:30 IST