BRS MLA : ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు

ABN , First Publish Date - 2023-06-14T08:22:29+05:30 IST

అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట ఐటీ సోదాలు సంచలనంగా మారాయి. భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం, కంపెనీల్లో నేటి ఉదయం నుంచి ఐటీ సోదాలను ప్రారంభించింది. భువనగిరి, హైదరాబాద్‌ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలానీలోని కార్యాలయాల్లో మొత్తం 12 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

BRS MLA : ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు

యాదాద్రి : అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట ఐటీ సోదాలు సంచలనంగా మారాయి. భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం, కంపెనీల్లో నేటి ఉదయం నుంచి ఐటీ సోదాలను ప్రారంభించింది. భువనగిరి, హైదరాబాద్‌ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలానీలోని కార్యాలయాల్లో మొత్తం 12 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌ కంపెనీలకు పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కొత్తపేటలో ఉన్నారు. ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు చేయడంతో బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ నెలకొంది. ఐటీ అధికారులు సుమారు 30 బృందాలతో ఈ సోదాలు చేస్తున్నారు. ఆదాయపన్ను చెల్లింపు వివరాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఐటీ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-06-14T08:24:34+05:30 IST