BRS MLA: అంతమాత్రానికే భయపడతారా?.. కడుపులో క్లాత్ మరిచిన ఘటనపై ఎమ్మెల్యే వింత సమాధానం..
ABN , First Publish Date - 2023-04-21T11:49:25+05:30 IST
జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఓ మహిళకు ఆపరేష్ చేసి కడుపులో క్లాత్ మరిచిన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
జగిత్యాల: జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఓ మహిళకు ఆపరేష్ చేసి కడుపులో క్లాత్ మరిచిన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (BRS MLA Sanjay Kumar) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి పేషెంట్ల తాకిడి పెరిగిందని.. అందుకే ఒకటి, రెండు ఘటనలు ఎక్కువ అవుతున్నాయని చెప్పుకొచ్చారు. అంతమాత్రాన భయపడొద్దన్నారు. ఆస్పత్రుల్లో చనిపోతే ఆసుపత్రికి వెళ్ళటం మానేస్తామా అంటూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వింత సమాధానం చెప్పారు. అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా.. 16 నెలల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళకు సర్జరీ ద్వారా ఆసుపత్రి వైద్యులు డెలివరీ చేశారు. అయితే కడుపులోనే బట్టను మరిచి ఆపరేషన్ పూర్తి చేశారు. సంవత్సరం తర్వాత మహిళకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల సూచన మేరకు స్కానింగ్ చేయించుకోగా.. కడుపులో బట్ట ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వైద్యులు మహిళకు ఆపరేషన్ చేసిన క్లాస్ తీసివేశారు. ఈ విషయం తెలుసుకున్న మహిళ బంధువులు.. క్లాత్ మరిచి ఆపరేషన్ చేసిన ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. స్థానిక పెద్దల జోక్యంతో బాధితురాలికి వైద్య ఖర్చులు ఇప్పిస్తామని బంధువులకు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు. రూ. 7 లక్షలు వైద్య ఖర్చుల నిమిత్తం రోగి బంధువులకు అందజేశారు. దీంతో అక్కడికి ఆ గొడవ సర్దుమణిగింది.