MP Arvind:ఉగ్రవాద సంస్థలు తెలంగాణలో పాతుకుపోతున్నాయి.. ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-11-06T17:21:57+05:30 IST
తెలంగాణ(Telangana) ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారుతోందని ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.
మెట్‌పల్లి: తెలంగాణ(Telangana) ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారుతోందని ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. మెట్ పల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న ఆయన నాలుగు మండలాల బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. "రోహింగ్యాలకు సీఎం కేసీఆర్(CM KCR) దొంగ పాస్ పోర్ట్ లు ఇస్తున్నారు. ఉగ్రవాద(Terrorism) సంస్థలకు తెలంగాణ అడ్డాగా మారుతోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రధాని మోదీ(PM Modi) నాయకత్వం అవసరం. అప్పుడే రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటాయి. బీజేపీ వచ్చాక గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలో బీడీ కార్మికుల కోసం ప్రత్యేక ఆసుపత్రి తీసుకొస్తాను. బీజేపీని ఆశీర్వదిస్తే కోరుట్లలో 15 వేల ఇళ్లు కట్టిస్తా. కాళేశ్వరంలాంటి ప్రాజెక్టులతో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడింది. డబ్బుల కోసం ఎమ్మెల్సీ కవిత ఆరాటపడి లిక్కర్ స్కాంలో దొరికారు" అని అరవింద్ అన్నారు.