Javadekar: ప్రధాని మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణా లేదు..

ABN , First Publish Date - 2023-06-11T10:54:04+05:30 IST

కరీంనగర్: తొమ్మిదేళ్ల మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ ప్రకాష్ జవదేకర్ అన్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ తొమ్మిదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన హయాంలో చేసిన అభివృద్ధిని...

Javadekar: ప్రధాని మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణా లేదు..

కరీంనగర్: తొమ్మిదేళ్ల మోదీ పాలన (Nine Years of Modi Rule)లో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ ప్రకాష్ జవదేకర్ (Prakash Javadekar) అన్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ (PM Modi) తొమ్మిదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన హయాంలో చేసిన అభివృద్ధిని వివరించడానికి బీజేపీ దేశవ్యాప్తంగా ‘సంపర్క్‌ అభియాన్‌’ సభలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జవదేకర్ ఆదివారం కరీంనగర్ పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చామని, తెలంగాణ మీద ఎలాంటి వివక్ష లేదని అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునఃప్రారంభం చేశామన్నారు. పంటలకు మద్దతు ధర పెంచామని, యూపీఏలో కేసీఆర్ భాగస్వామిగా ఉండి మద్దతు ధర పెంచలేకయారని జవదేకర్ విమర్శించారు.

కాగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ షా ఆదివారం విశాఖ నగరానికి వస్తున్నారు. శ్రీకాళహస్తిలో శనివారం జరిగిన సభకు నడ్డా హాజరు కాగా...విశాఖ సభకు అమిత్‌ షా వస్తున్నారు. ఇక్కడి రైల్వే ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో ఈ సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ప్రధాని హోదాలో మోదీ 2019లో వచ్చినప్పుడు కూడా ఇదే గ్రౌండ్‌లో సభ నిర్వహించారు. ఇప్పుడు అక్కడే అమిత్‌ షా విశాఖ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభకు ఆయన తమిళనాడు నుంచి బయలుదేరి ఆదివారం సాయంత్రం వస్తారు. ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మాట్లాడతారు. ఆ తరువాత పోర్టు అతిథి గృహానికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరువాత ఎనిమిది గంటలకు అక్కయ్యపాలెంలోని సాగరమాల ఆడిటోరియంలో శక్తి కేంద్రాల ప్రముఖులు వంద మందితో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళ్లిపోతారు. సభలో పార్టీ జాతీయ కార్యదర్శి పురందేశ్వరి, సత్యకుమార్‌, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి మురళీధరన్‌ తదితరులు పాల్గొననున్నారు.

Updated Date - 2023-06-11T10:54:04+05:30 IST