Rakhi sad incidence: అయ్యో ఎంతటి విషాదం.. అప్పటిదాకా చెల్లెలితో సరదాగా మాట్లాడిన అన్నయ్య క్షణాల్లోనే...
ABN , First Publish Date - 2023-08-30T11:58:53+05:30 IST
అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. రాఖీ వచ్చిందంటే చాలు సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టాలని ఎంతగానో ఆరాటపడుతుంటారు. అదే విధంగా ఆ చెల్లి కూడా తన అన్నకు రాఖీ కట్టేందుకు ఆనందంగా తన పుట్టింటికి వచ్చింది. అయితే అదే వారికి చివరి రాఖీ అవుతుందని ఆ చెల్లెలు, అన్నా ఊహించలేకపోయారు.
పెద్దపల్లి జిల్లా: అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టాలని ఎంతగానో ఆరాటపడుతుంటారు. అందరిలానే ఓ చెల్లి కూడా తన అన్నకు రాఖీ కట్టేందుకు ఆనందంగా తన పుట్టింటికి వెళ్లింది. అయితే అత్యంత విషాదకర రీతిలో మృతదేహానికి రాఖీ కట్టాల్సి వచ్చింది. చూసినవారందరినీ దు:ఖానికి గురిచేసున్న ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. రాఖీ పండుగ ముందు విషాదం చోటు చేసుకుంది. అన్న మృతదేహానికి చెల్లెలు రాఖీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలిగేడు మండలం ధూళికట్టకి చెందిన చౌదరి కనకయ్యకు రాఖీ కట్టేందుకు చెల్లె గౌరమ్మ ఇంటికి వచ్చింది. అప్పటిదాకా చెల్లెతో సంతోషంగా గడిపిన కనకయ్య ఒక్కసారిగా గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
ఆపై క్షణాల వ్యవధిలో కన్నకయ్య ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో సంతోషంగా తన అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లికి అంతులేని విషాదం మిగిలింది. చివరకు అన్నయ్య మృతదేహానికే సోదరి రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంది. ఇద్దరి మధ్య ఉన్న అనురాగాన్ని చూసినవారంతా కన్నీటి పర్యంతమయ్యారు.