Bandi Sanjay: కేసీఆర్కు అహంకారం ఎక్కువ: సంజయ్

ABN , First Publish Date - 2023-04-19T18:43:08+05:30 IST

సీఎం కేసీఆర్‌ (CM KCR)పై బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు. కేసీఆర్కు అహంకారం ఎక్కువ అని ధ్వజమెత్తారు.

Bandi Sanjay: కేసీఆర్కు అహంకారం ఎక్కువ: సంజయ్

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ (CM KCR)పై బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు. కేసీఆర్కు అహంకారం ఎక్కువ అని ధ్వజమెత్తారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని తప్పుబట్టారు. టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీపై బీజేపీ ఆందోళన కొనసాగుతోందని ప్రకటించారు. నవంబర్లో కేసీఆర్ రిటైర్మెంట్ కానున్నారని సంజయ్ జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్ (BRS) పార్టీకి బీటీమ్గా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. టీకాంగ్రెస్ నేతలు ఎవరి కోసం పనిచేస్తున్నారని ప్రశ్నించారు. మరో రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్తో చేతులు కలిపారని, తెలంగాణలో మాత్రం కేసీఆర్‌కు వ్యతిరేకంగా యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. గత రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా కాంగ్రెస్ పనిచేసిందని తెలిపారు. బీజేపీ సవాల్‌కు కేసీఆర్ సమాధానం ఇవ్వలేదని బండి సంజయ్ ఎద్దేవాచేశారు.

Updated Date - 2023-04-19T18:43:08+05:30 IST