Preethi Case: మెడికో ప్రీతి కేసుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-02-27T18:41:02+05:30 IST

వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీ(కేఎంసీ)కి చెందిన పీజీ మొదటి సంవత్సరం(అనస్థీషియా) విద్యార్థిని ప్రీతి (Preethi) కథ విషాదాంతమైంది.

Preethi Case: మెడికో ప్రీతి కేసుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీ(కేఎంసీ)కి చెందిన పీజీ మొదటి సంవత్సరం(అనస్థీషియా) విద్యార్థిని ప్రీతి (Preethi) కథ విషాదాంతమైంది. ప్రీతి కేసుపై మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. ప్రీతి ఘటనను రాజకీయం చేస్తున్నారని తప్పుబట్టారు. ప్రీతిని హత్య చేసిన వారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు సైఫ్ అయినా సంజయ్ అయినా ఎవరినీ వదలమని కేటీఆర్ హెచ్చరించారు. ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్‌ (NIMS) ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన ప్రీతి ఆదివారం రాత్రి 9.10 గంటలకు తుదిశ్వాన విడిచారు. డాక్టర్ల బృందం ఆమెను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ప్రీతి తన సీనియర్‌ ఎంఏ సైఫ్‌ వేధింపులు భరించలేక ఈనెల 22న ఉదయం మత్తు ఇంజక్షన్‌ తీసుకుంది.

అత్యవసర ఆపరేషన్‌ థియేటర్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెకు ఎంజీఎంలోనే చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు నిమ్స్‌కు తరలించారు. అప్పటికే ఆమె గుండె పనితీరు మందగించడంతో ఎంజీఎంలో సీపీఆర్‌ (CPR) నిర్వహించారు. హైదరాబాద్‌కు తరలించిన తర్వాత రెండుసార్లు నిమ్స్‌ వైద్యులు కూడా సీపీఆర్‌ చేశారు. నిమ్స్‌ తరలించే సరికే ఆమె శరీరంలోని వివిధ అవయవాలు విఫలమయ్యాయని నిమ్స్‌ వైద్యులు తెలిపారు. నిమ్స్‌లో చేరినప్పటి నుంచీ ప్రీతి ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదు. ఆమె అవయవాలన్నీ దెబ్బతినడం వల్ల చికిత్సకు ఏ మాత్రం స్పందించలేకపోయాయి. ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తూ వచ్చింది. శనివారం నుంచే ఆమె శరీరం రంగు మారుతూ వచ్చింది. ఆదివారం రాత్రి ప్రీతి తుదిశ్వాస విడిచింది.

ప్రీతి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా

ప్రీతి కుటుంబానికి 10 లక్షల రూపాయిలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. అంతేకాదు.. ప్రభుత్వ పరంగా ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కేసీఆర్ సర్కార్ భరోసా ఇచ్చింది. విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) ఈప్రకటన విడుదల చేశారు.

Updated Date - 2023-02-27T18:41:03+05:30 IST