Khammam: రేవంత్ సీఎం అయ్యారు.. పాదయాత్రగా భద్రాద్రి బయలుదేరాడు..
ABN , First Publish Date - 2023-12-09T10:54:47+05:30 IST
కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి(Revanth Reddy), వైరా ఎమ్మెల్యేగా రాందాస్ నాయక్ విజయం
కొణిజర్ల(ఖమ్మం): కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి(Revanth Reddy), వైరా ఎమ్మెల్యేగా రాందాస్ నాయక్ విజయం సాధించడంతో ఓ కాంగ్రెస్ కార్యకర్తలు భద్రాచలం రాములవారి సన్నిధికి శుక్రవారం పాదయాత్రగా బయలు దేరాడు. కొణిజర్ల మండలం అన్నవరం గ్రామానికి చెందిన రాయల ఎల్లారావు(Rayala Yalla Rao) అన్నవరం నుంచి భద్రాచలానికి పాదయాత్రను చేపట్టాడు. ఈ సందర్భంగా యల్లారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ద్వారానే రేంవత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాదయాత్రగా భద్రాచలం(Bhadrachalam) వస్తానని మొక్కు కున్నానన్నారు. అందులో భాగంగా పాదయాత్రగా బయలు దేరినట్లు తెలిపాడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అంతా మేలు జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.