Sudhakar Reddy: ప్రధానిగా మళ్లీ మోడీనే ప్రజలు కోరుకుంటున్నారు
ABN , First Publish Date - 2023-06-27T16:30:40+05:30 IST
అన్ని రాష్ట్రాల ప్రజలు మళ్లీ మోడీనేత ప్రధాని కావాలని కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు పన్ని నరేంద్ర మోడీని ఓడించాలని చూస్తున్నారు. కానీ వారి పప్పులు దేశంలో ఉడకవు. ప్రజలు వారి కుట్రలను తిప్పికొడతారు. కొంతమంది పాదయాత్ర చేసి అధికారంలోకి వస్తాం అంటున్నారు. కర్ణాటక రాష్ట్రాన్ని చూపించి తెలంగాణలో అధికారంలోకి వస్తామని అంటున్నారు. 120 కిలోమీటర్ల స్పీడ్‌లో మైండ్ గేమ్ నడుస్తుంది.
ఖమ్మం: అన్ని రాష్ట్రాల ప్రజలు మళ్లీ మోడీనేత ప్రధాని కావాలని కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి (Ponguleti Sudhakar Reddy) తెలిపారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు పన్ని నరేంద్ర మోడీని ఓడించాలని చూస్తున్నారు. కానీ వారి పప్పులు దేశంలో ఉడకవు. ప్రజలు వారి కుట్రలను తిప్పికొడతారు. కొంతమంది పాదయాత్ర చేసి అధికారంలోకి వస్తాం అంటున్నారు. కర్ణాటక రాష్ట్రాన్ని చూపించి తెలంగాణలో అధికారంలోకి వస్తామని అంటున్నారు. 120 కిలోమీటర్ల స్పీడ్‌లో మైండ్ గేమ్ నడుస్తోంది. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కొంతమంది నరేంద్ర మోడీ గురించి మాట్లాడటం సరికాదు. ఖమ్మం జిల్లాలో ఏదో చేస్తాం అంటున్నారు. డబ్బు రాజకీయాలు ఎన్నో చూశాం. దుబ్బాక, హైదరాబాద్, హుజుర్ నగర్ ఎన్నికల్లో ఏమైంది కాంగ్రెస్ పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. సాక్ష్యాత్తు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడే ఓటుకి నోటు కేసులో నిందితుడు. కార్యకర్తలను గందరగోళం చేసేందుకే బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నారు.’’ అని సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
‘‘10 లక్షల పోలింగ్ బూత్ కార్యకర్తలతో సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమం మధ్యప్రదేశ్ నుంచి కాశ్మీర్ వరకు జరుగుతుంది. బూత్ కార్యకర్తలు ఏం చేయాలి వారు ప్రజలతో ఏ విధంగా మమైకం అవ్వాలి అనేది ముఖ్య ఉద్దేశం. దేశంలో 18 రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీని ఆదరించారు. బీజేపీ పార్టీకి సుమారు 18 కోట్ల కార్యకర్తలు ఉన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ(PM MODI) ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా సుమారు 50 కోట్ల మందికి లబ్ది జరుగుతుంది.’’ అని సుధాకర్‌రెడ్డి వివరించారు.