Khammam: వృద్ధురాలికి తెలియకుండానే వేలిముద్రలు తీసుకుని ఏం చేశాడో తెలుసా?

ABN , First Publish Date - 2023-02-28T13:18:36+05:30 IST

బిడ్డ పెళ్లికి అక్కరకు వస్తాయని ఓ తండ్రి పైసా పైసా కూడబెట్టిన డబ్బు, వృద్దాప్యంలో ఉపయోగపడుతుందని ఓ మహిళ దాచుకున్న సొమ్ము(Amount), భర్త చనిపోవడంతో తన పిల్లల చదువుకు ఉపయోగపడతాయని ఓ మహిళ కూడబెట్టిన నగదు ఒక్కొక్కరిది ఒక్కో ఆశ. ఇలాంటి వారికి ఓ వ్యక్తి కుచ్చుటోపి పెట్టాడు.

Khammam: వృద్ధురాలికి తెలియకుండానే వేలిముద్రలు తీసుకుని ఏం చేశాడో తెలుసా?

చిట్టీల పేరుతో జనాలకు కుచ్చుటోపి

35 లక్షలతో ఉడాయించిన మోసగాడు

పోలీసులను ఆశ్రయించినా జరగని న్యాయం

ఆళ్లపల్లి (ఆంధ్రజ్యోతి): బిడ్డ పెళ్లికి అక్కరకు వస్తాయని ఓ తండ్రి పైసా పైసా కూడబెట్టిన డబ్బు, వృద్దాప్యంలో ఉపయోగపడుతుందని ఓ మహిళ దాచుకున్న సొమ్ము(Amount), భర్త చనిపోవడంతో తన పిల్లల చదువుకు ఉపయోగపడతాయని ఓ మహిళ కూడబెట్టిన నగదు ఒక్కొక్కరిది ఒక్కో ఆశ. ఇలాంటి వారికి ఓ వ్యక్తి కుచ్చుటోపి పెట్టాడు. ఆళ్లపల్లి మండల పరిధిలో మర్కోడులో జరిగిన ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్కోడుకు చెందిన ఓ వ్యక్తి చిట్టీల పేరుతోవ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో నాలుగు పైసలు కళ్ల జూసే సరికి జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇదే సువర్ణ అవకాశంగా అనుకున్న సదరు వ్యక్తి పెద్ద మొత్తంలో లక్ష్లల్లో చిట్టి పాటలు నిర్వహించండం మొదలు పెట్టాడు. అదనుచూసి ఏకంగా రూ.35 లక్షలతో ఉడాయించాడు. అంతకుముందు అదే గ్రామంలో ఓ వృద్ధురాలి దగ్గర లోన్ డబ్బులను (Loan Amount) బాధితురాలికి తెలియకుండానే వేలిముద్రలు (Thumbniles) తీసుకుని రూ.90 వేలు డ్రా చేశాడు. ఈ విషయం బయటకు రావడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి రూ. 40 వేలు ఇవ్వగా మిగతా డబ్బులను వడ్డీతో సహా ఇస్తానని నమ్మించాడు. ఇవే కాకుండా గ్రాస్తుల కొంత నగదు రూపంలో అప్పుగా తీసుకుని చెక్కులను అప్పగించి, గ్రామం విడిచి ఉడాయించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మోసపోయామని తెలుసుకుని కుటుంబ సభ్యులను సంప్రదించడగా పెద్దల సమక్షంలో కుటుంబ సభ్యులు, తీసుకున్న సొమ్మును వాయిదా పద్దతిలో ఇస్తామని తెలిపారు.

ఏడాది కావస్తున్న ఇప్పటికీ కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోకపోవడంతో బాధితులు ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కాలయాపనతో తమకు అక్కడ కూడా న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రూపాయి రూపాయి పోగేసుకున్న డబ్బును మోసగాడు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు పూణెం రాజు, లక్ష్మి, విజయ, శేఖర్, మల్లికార్జన్, శ్రీను, సుబ్బారావు, యాకయ్య, నవీన్, నర్సమ్మ కోరుతున్నారు.

Updated Date - 2023-02-28T13:21:08+05:30 IST