Khammam Inter Student: పాపం ఈ ఖమ్మం ఇంటర్ స్టూడెంట్.. గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్న పాపానికి..

ABN , First Publish Date - 2023-03-15T17:23:44+05:30 IST

గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకుని పరీక్షా కేంద్రానికి బయల్దేరిన ఇంటర్ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. సమయానికి ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోలేక భంగపాటుకు..

Khammam Inter Student: పాపం ఈ ఖమ్మం ఇంటర్ స్టూడెంట్.. గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్న పాపానికి..
ఇంటర్ స్టూడెంట్

Inter Exams: గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకుని పరీక్షా కేంద్రానికి బయల్దేరిన ఇంటర్ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. సమయానికి ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోలేక భంగపాటుకు గురయ్యాడు. దీంతో ఏడాదంతా కష్టపడి చదివిన చదువు అంతా వృధా అయిపోయింది. ఈ సంఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

ఖమ్మం రూరల్‌ (Khammam) మండలం కొండాపురం గ్రామానికి చెందిన విద్యార్థి వినయ్‌ (Vinay) ఇంటర్‌ చదువుతున్నాడు. బుధవారం నుంచి ఇంటర్‌ పరీక్షలు (Inter Exams) ప్రారంభం కావడంతో ఎగ్జామ్‌ సెంటర్‌కు వెళ్లేందుకు గూగుల్‌ మ్యాప్స్‌ (Google Maps)ను ఆశ్రయించాడు. మ్యాప్ చూపించిన డైరెక్షన్‌లో ముందుకు సాగాడు. అయితే తాను వెళ్లాల్సిన లొకేషన్‌కు కాకుండా మరో స్థలానికి గూగుల్‌ మ్యాప్ తీసుకెళ్లింది. ఈ పరిణామంతో ఆందోళన చెందిన స్టూడెంట్.. పరీక్షకు సమయం సమీపించడంతో మెరుపు వేగంతో కనిపించిన వారినందరినీ అడ్రస్ అడుగుతూ పరీక్షా కేంద్రానికి బయల్దేరాడు. ఎట్టకేలకు అతి కష్టం మీద సెంటర్‌కు చేరుకున్నాడు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాదాపు 27 నిమిషాలు ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకున్నాడు. అయితే నిమిషం ఆలస్యం నిబంధన కారణంగా వినయ్‌ను పరీక్ష రాసేందుకు సిబ్బంది లోపలికి అనుమతించలేదు. గూగుల్ మ్యాప్ వలన ఎదురైన సమస్యను అధికారుల ముందు గోడు వెళ్లబుచ్చుకున్న సిబ్బంది ససేమిరా అనడంతో చేసేదేమీ లేక తీవ్ర ఆవేదనతో ఇంటికి వెనుదిరిగాడు.

Updated Date - 2023-03-15T17:29:37+05:30 IST